డా. బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గణపతి ఫుడ్స్ రెస్టారెంట్‌కు స్వచ్ఛ ఆంధ్ర - 2026 బెస్ట్ రెస్టారెంట్ అవార్డు లభించింది. శుక్రవారం, స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం గోదావరి భవన్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ R మహేష్ కుమార్, అమలాపురం శాసన సభ్యులు అయితా బత్తుల ఆనందరావు, పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మధుర్, ఆముడా చైర్మన్ అల్లాడ సోంబాబు, అమలాపురం మున్సిపల్ కమీషనర్ నిర్మల్ కుమార్ చేతుల మీదుగా రెస్టారెంట్ యాజమాన్యం బాలు, దేవా ఈ అవార్డును అందుకున్నారు.