కలెక్టరేట్ లో ఉద్యోగ మేళా

కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో జూలై 8వ తేదీన (బుధవారం) మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల తెలిపారు. ఈ మేళా ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ కంపెనీల హెచ్‌ఆర్‌లు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు తమ బయోడేటాతో కలెక్టరేట్‌కు హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్