ఈ నెల 6న జాబ్ మేళా

అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వసంత లక్ష్మి తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్