ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ లో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి హరిప్రసాద్ శనివారం సూచించారు. 25-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులని, వారికి మంచి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని పూర్తి వివరాలను https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.