చిత్తూరు జిల్లా వీకోటలో 'ఆంధ్రజ్యోతి' విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ అమలాపురం కలెక్టరేట్ వద్ద APWJF, APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టులు బుధవారం ఆందోళన చేపట్టారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ప్రతినిధులు, యూనియన్ నేతలు పాల్గొన్నారు.