రాజ్యసభ సభ్యునిగా రెండోసారి ఎన్నికైన సానా సతీష్ బాబుకు సోమవారం అమలాపురంలో ఘన సన్మానం చేయనున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు తెలిపారు. సోమవారం రావులపాలెంలో స్వాగతం పలికాక, కార్లు, బైక్ ల ర్యాలీతో అమలాపురం గడియార స్తంభం సెంటర్ చేరుకుంటారు. అనంతరం సత్యనారాయణ గార్డెన్స్‌లో జరిగే పౌర సన్మాన సభను విజయవంతం చేయాలని పల్లంరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ కోరారు.