ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లికి చెందిన గుత్తుల నాగబాబు ఈ నెల 23 నుంచి అదృశ్యమైనట్లు ఎస్ఐ ఎస్. కె. జానీ బాషా ఆదివారం తెలిపారు. భర్త కనిపించడం లేదంటూ ఆయన భార్య దుర్గా భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఐదడుగుల ఎత్తు, చామనఛాయ రంగులో ఉండే నాగబాబు ఆచూకీ తెలిసిన వారు 94409 04852 నంబరుకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.