కేతావారిదిబ్బలో క్షుద్రపూజల కలకలం

అమలాపురం రూరల్ మండలంలోని సవరపాలెం కేతావారిదిబ్బలో క్షుద్రపూజల కలకలం రేగింది. 20 బీసీ కుటుంబాలను భయపెట్టేలా ఆకతాయిలు నిమ్మకాయలు, దిష్టిబొమ్మలు, పసుపు కుంకుమలతో ముగ్గులు వేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ముగ్గులను తొలగింపజేసి, గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్