అమలాపురంలో ఘనంగా ప్రారంభంమైన పవన్ కల్యాణ్ పుట్టినరోజువేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో నల్లా శ్రీధర్ సతీమణి నల్లా ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ టౌన్ వైడ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఎంపీ గంటి హరీష్ మాధుర్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 700 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. అనంతరం 300 మందికి హెల్త్ కార్డ్ లు అందజేశారు. ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

సంబంధిత పోస్ట్