రామచంద్రపురం: అద్దం లేదు.. ప్లాస్టిక్ కవరే ఆధారం!

రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరించే లారీ డ్రైవర్ ముందు అద్దం ధ్వంసం కావడంతో, దాని స్థానంలో ప్లాస్టిక్ కవర్ను ఏర్పాటు చేసి వాహనాన్ని నడుపుతున్నారు. భద్రతా నియమాలను పాటించకుండా వాహనాన్ని నడపడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శానిటరీ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు స్పందిస్తూ, త్వరలోనే లారీకి కొత్త అద్దాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్