జనగామ జిల్లా రాఘవాపూర్ హైవేపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమలోని అమలాపురంకు చెందిన ముగ్గురు మృతి చెందారు. లారీని కారు ఢీకొట్టింది. కారులో కాళేశ్వరానికి వెళ్లొస్తుండగా ముందున్న లారీని అతివేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో శ్రీను, రమణకుమారి, అనూష అక్కడికక్కడే మృతి చెందగా రాజేశ్వర్ రావు, అనంతలక్ష్మి, సత్య లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా హైదరాబాద్ లో ఉంటున్నారు.