ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మట్టపర్తి కృష్ణ ఇంటి వద్ద ఉంచిన బైకును అమలాపురానికి చెందిన రౌడీ షీటర్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో బైక్ పూర్తిగా కాలిపోయిందని బాధితుడు కృష్ణ గురువారం వాపోయారు. తన కుటుంబాన్ని చంపేస్తానంటూ రౌడీ షీటర్ హల్చల్ చేశాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.