ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ లో జరిగే సంక్రాంతి సంబరాలు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ హీరోయిన్ హెబ్బా పటేల్ రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ హెబ్బా పటేల్ ఓ వీడియోలో మాట్లాడుతూ ఈనెల 15న జరిగే సంబరాలకు నేను వస్తున్నానని మీరు కూడా రావాలని శనివారం ఒక వీడియో విడుదల చేసింది.