ఆవును చంపిన ముగ్గురు నిందితులకు 15 రోజుల రిమాండ్

ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఆవును హింసించి చంపిన ఘటనలో ముగ్గురు నిందితులకు కొత్తపేట కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ విషయాన్ని ఎస్సై ఎస్.రాము వెల్లడించారు. నిందితులు మంగళవారం పశువుల మకాంలో ఉన్న ఆవును తీవ్రంగా హింసించి చంపినట్లు ఆయన తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕