టిట్కో ఫ్లాట్లలో మహిళ అనుమానాస్పద మృతి, భర్తపై అనుమానం

అల్లవరం మండలం బోడసకుర్రు టిట్కో ఫ్లాట్లలో రామలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త శ్రీనివాసరావు మరో మహిళతో సన్నిహితంగా ఉండటంపై గతంలో గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. శనివారం బయట గొళ్లెం పెట్టి ఉండటంతో పోలీసులు తలుపులు తీసి చూడగా ఆమె శవమై కనిపించింది. మృతురాలి ఫోన్ అదృశ్యమైంది. భర్తను వన్నెచింతలపూడిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్