ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉత్తర తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రుతుపవన పరిస్థితితో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాకు సోమవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.