అమలాపురంలో డ్రైనేజీలో పడ్డ యువతి: తప్పిన ప్రమాదం

అమలాపురం దేవాంగుల వీధిలో సోమవారం ఒక యువతి బైక్‌పై వెళ్తూ డ్రైనేజీలో జారిపడింది. డ్రైనేజీపై సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. స్థానికులు వెంటనే స్పందించి యువతిని రక్షించారు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయింది. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్