తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో, వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తి జి. బి. ఆర్, టి. ఎ. ఆర్ పాఠశాలల విద్యార్థులు స్థానిక గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ వద్ద మాజీ శాసనసభ్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ, వైద్యులు రోగుల ప్రాణాలను కాపాడటానికి నిరంతరం శ్రమిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.