కుతుకులూరులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

అనపర్తి మండలం కుతుకులూరులో సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బుధవారం  ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్