మహిళా BLOపై ఆగ్రహం వ్యక్తం చేసిన టర్నింగ్ అధికారి ?

బిక్కవోలు మండలం బలభద్రపురంలో జరుగుతున్న SIR కార్యక్రమంపై గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సమీక్ష జరిగింది. అనపర్తి రిటర్నింగ్ అధికారి (RO) ప్రేమ్ కుమార్, బిక్కవోలు తహశిల్దార్ రమాదేవిలు BLOలతో జరిపిన సమీక్షలో ఒక మహిళా BLO పనితీరుపై ఆరోపణలు వచ్చాయి. దరఖాస్తుల పంపిణీ, సేకరణకు BLO వెళ్లకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులైన BLA లను వినియోగించడంపై RO ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మందలించినా తీరు మార్చుకోలేదని, మళ్ళీ పొరపాటు చేస్తే ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తామని RO హెచ్చరించారు. BLAలు కేవలం చిరునామాలు చూపడానికి మాత్రమేనని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్