రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలోని పొలమూరు, మహేంద్రవాడ గ్రామాల్లో శనివారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పొలమూరులో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించగా, మహేంద్రవాడలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టే వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే మూడేళ్లలో అనపర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అనిత తెలిపారు.