కొంకుదురులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

అనపర్తి మండలం కొంకుదురులో బుధవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. వైయస్సార్ మార్కెట్ సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సత్తి నాగిరెడ్డి రాజా, ఎంపీటీసీలు పి వి వి ఎస్ ఎన్ రెడ్డి (పి. వి), నల్లమిల్లి అమ్మిరెడ్డి, తాడి చినబాబు, మల్లిడి కోదండం, తేతల శ్రీనివాసరెడ్డి, డి ఎస్ ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్