అయినవిల్లి మండలంలోని కాపశంకరాయగుడెం గ్రామానికి చెందిన నక్కా రామలక్ష్మి (63) మతిస్థిమితం సరిగాలేని కారణంగా గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను వైద్యచికిత్స నిమిత్తం అమలాపురం అసుపత్రికి తరలించినట్లు ఎస్సై మనోహరజోషి తెలిపారు. గురువారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన చెప్పారు. కుమారుడు సూర్యనారాయణ ఫిర్యా దుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు