అయినవిల్లి మండలం వెలవలపల్లిలో కోళ్ల విషయంలో ఇరుగుపొరుగు మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. గ్రామానికి చెందిన ఓ కోడిపుంజు, పక్కనే ఉన్న కోడిపెట్టతో కలవడంతో, పెట్ట యజమాని ఆగ్రహించి పుంజును కొట్టి గాయపరిచాడు. దీనిపై పుంజు యజమాని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం ముదరడంతో పుంజు యజమాని శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై జ్యోతి తెలిపారు.