అంబాజీపేటకు చెందిన రామసుబ్రహ్మణ్యం, నాగమణి దంపతులు మంగళవారం సూసైడ్ నేపథ్యంలో వారి సుసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ఇంతవరకు మాకు చేసిన సేవలు చాలు, మీరైనా సుఖపడండి అని లేఖలో పేర్కొన్నారు. పదేళ్ల క్రితం కొడుకు వెంకటకిరణ్, కోడలు లక్ష్మీశ్వేత, మనవరాలు, మనవడు రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వీరిని మనోవేదనకు గురిచేసింది. ప్రస్తుతం వీరి వద్ద చిన్న కుమార్తె సునీత తన బిడ్డతో ఉంటున్నారు.