అంబాజీపేట: కొబ్బరితోటలో ఆడశిశువు గుర్తింపు

అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలోని శ్మశాన వాటిక సమీపంలో గల కొబ్బరితోటలో ఈ నెల 19న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఓ ఆడశిశువు లభ్యమైంది. స్థానికుడు బాలాజీ పాపను గుర్తించి, అంబాజీపేట మహిళా ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పీవీవీ సత్యనారాయణ శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్