మామిడికుదురు మండలం పాసర్లపూడిలంక మధ్య లంకలో ఎలుగుబంటి కలకలం రేపింది. బుధవారం రాత్రి వేటకు వెళ్తున్న సమయంలో ఎలుగుబంటిలా ఉన్న భారీ జంతువును చూశామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వేటకు వెళ్లేందుకు భయం వేస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపి ఆ జంతువు ఏంటో ప్రజలకు చెప్పి దానిని బంధించాలని వారు కోరారు.