పాసర్లపూడిలంకలో పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

ఒక కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పంట కాలువలకు దూసుకు వెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. మామిడికుదురు మండలం పాసర్లపూడిలంకలో ఓ కారు ప్రమాదవశాత్తు పంట కాలువలోకి దూసుకెళ్లింది. శివాలయంలో పూజలు నిర్వహించుకుని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఘటన స్థలంలోని స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారని వారు చెప్పారు. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్