పి. గన్నవరం మండలంలోని కుందాలపల్లిలో ఈ నెల 16న శ్మశానవాటికకు వెళ్తున్న మృతదేహాన్ని అడ్డుకున్న కేసులో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బుధవారం రాజోలు కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై శివకృష్ణ తెలిపారు. కొత్తపేట డి. ఎస్. పి. సుంకర మురళీ మోహన్ నేతృత్వంలో నిందితులైన పప్పుల లక్ష్మణరావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, అల్లపల్లి అర్జునరావు సహా మొత్తం తొమ్మిది మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.