మామిడికుదురు: అబ్బురపరుస్తున్న బొప్పాయి చెట్టు

మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో బొరుసు సూర్యనారాయణ ఇంటి పెరట్లో బొప్పాయి చెట్టు పది తలలతో ఆకట్టుకుంటుంది. ఒక చెట్టుకు 10 కొమ్మలు వచ్చాయి. కొమ్మ కొమ్మకు పుష్కలంగా కాయలు కాసాయి. 300కు పైగా బొప్పాయి కాయలతో చెట్టు అబ్బుర పరుస్తోంది. అటువైపు వెళ్లే ప్రతి ఒక్కరు ఆ చెట్టును విశేషంగా తిలకిస్తున్నారు. దేశవాళీ రకానికి చెందిన ఈ చెట్టు ఏ విధమైన ఎరువులు వేయకుండానే సహజసిద్ధంగా కాసిందని సూర్యనారాయణ సోమవారం చెప్పారు.

సంబంధిత పోస్ట్