మామిడికుదురు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో సోమవారం పీఎంఎఫ్ఎంఈ, పీఎంईజీపీ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ జిల్లా కోఆర్డినేటర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహిళలు ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని, తక్కువ మూలధనంతో వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు.