అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి ఈసారి రూ.15,14,993 బిల్లు రావడంతో అయన షాక్‌కు గురయ్యారు. ప్రతినెలా రూ. 1300 వచ్చే కరెంట్ బిల్లు జూలైలో రూ.15,14,993 రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ మీటర్ల వల్ల భారం పెరిగిందని అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆయన శనివారం కోరారు.