పి. గన్నవరం మండలవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు డా. షేక్ జాషిం, డా. రియా, డా. మౌనిక తెలిపారు. గ్రామ సచివాలయాలు, బస్టాండ్ సెంటర్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, రెండు మొబైల్ టీమ్లను కూడా అందుబాటులో ఉంచారు. పుట్టిన శిశువుల నుండి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు కోరారు.