మామిడికుదురు మండలం పెదపట్నంలంక బొక్కావారిపాలెం వద్ద వైనతేయ గోదావరి నదిలో మంగళవారం స్నానానికి వెళ్లి గల్లంతైన బండారి శ్రీనివాసరావు (55) మృతదేహం రాత్రి 10 గంటల సమయంలో లభ్యమైంది. స్థానికులు గాలించగా మృతదేహం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.