నేదునూరులో యథేచ్ఛగా రొయ్యల చెరువుల సాగు!

అయినవిల్లి మండలం నేదునూరులో ఎలాంటి అనుమతులు లేకుండా ఉప్పునీటి రొయ్యల చెరువుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీనివల్ల చుట్టుపక్కల పంట భూములు నాశనమవుతున్నాయని స్థానిక రైతులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కోర్టును ఆశ్రయించడంతో తవ్వకాలు నిలిచిపోయినా, ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయని రైతులు ఆరోపించారు. వ్యవసాయాన్ని కాపాడేందుకు అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్