అంబాజీపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ఓమోస్తరు వర్షం కురిసింది. అప్పటి వరకు తీవ్ర ఉక్కుబోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. అరగంట పాటు ఒక మాదిరిగా వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ మొబైల్ ఫోన్లకు హెచ్చరికలు పంపించింది.