పాశర్లపూడిలంకలో యువకుల హల్చల్

మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు కారుతో సోమవారం అర్ధరాత్రి హల్చల్ చేశారు. అతి వేగంగా కారు నడుపుతూ గ్రామంలోని రామాలయాన్ని ఢీకొట్టారని స్థానికులు మంగళవారం ఉదయం తెలిపారు. కారులో ఉన్న యువకులు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని స్థానికులు అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్