నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామంలో రాత్రి వీచిన సుడిగాలి కారణంగా పంటలు, వ్యవసాయానికి సంబంధించిన ఆస్తులు నష్టపోయిన రైతులను ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు పరామర్శించారు. బాధిత రైతులతో మాట్లాడి, సుడిగాలి కారణంగా జరిగిన నష్టాలను స్వయంగా పరిశీలించారు. నష్టంపై పూర్తి వివరాలను, సమస్యలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదించి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని బ్రహ్మరాజు హామీ ఇచ్చారు.