డీసీసీబీ బ్యాంకు ఉద్యోగి చంద్రరావుకు ఘన సన్మానం

దేవరపల్లి మండలం యర్నగూడెంలోని డీసీసీబీ బ్యాంకులో 25 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న చంద్రరావుకు శనివారం ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ సెక్రెటరీ బళ్ళ సూర్యచక్రం హాజరై చంద్రరావును సత్కరించారు. సుదీర్ఘకాలం బ్యాంకు సేవల్లో కొనసాగుతూ సహచరులు, ఖాతాదారులు, ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్న చంద్రరావు సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕