దేవరపల్లి: రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు

దేవరపల్లి మండలం యర్నగూడెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా నుంచి అన్నవరం దివ్యదర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. హైవే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్