ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 (P4) విధానంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం, దేవరపల్లి పోలీస్ స్టేషన్లకు నూతన పోలీసు వాహనాలను అందజేశారు. రూ. 24 లక్షల విలువైన రెండు మహీంద్రా బొలెరో నియో వాహనాలను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ కి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు త్వరితగతిన సేవలు అందించేందుకు నూతన వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు.