వైసీపీలోకి చేరిన మాజీ ఎంపీటీసీ

గోపాలపురం గ్రామ మాజీ ఎంపీటీసీ పైడి దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి, మాజీ హోంమంత్రి తానేటి వనిత సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుని వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పైడి దొరబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕