కృష్ణం పాలెం లో అనాధ శరణాలయానికి శంకుస్థాపన

గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో కెర్ సొసైటీ చైర్మన్ జి. శ్యామలాదేవి ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, అనాథల సంక్షేమం కోసం నిర్మించనున్న అనాథ శరణాలయం భవనానికి ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ హోంమంత్రి తానేటి వనిత హాజరై శంకుస్థాపన చేశారు. సమాజంలోని నిరుపేదలు, అనాథలు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం కల్పించే లక్ష్యంతో ఈ శరణాలయం నిర్మాణం చేపట్టడం అభినందనీయమని, సేవా దృక్పథంతో చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తానేటి వనిత పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్