దేవరపల్లి మండలం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం సంగాయిగూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో కలిసి కొవ్వూరు వైపు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రమాదానికి గురయ్యారు. భార్య, భర్త, కుమారుడిని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మిగిలిన ఇద్దరు కుమార్తెలను మరో ఆసుపత్రికి తరలించారు.