గోపాలపురం మండలం జగన్నాధపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉ. 8 గంటల నుంచి 12. గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని ఈఈ నారాయణ అప్పారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో బదులుగా వ్యవసాయ వినియోగదారులకు ఉ. 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.