గోపాలపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ నారాయణ అప్పారావు శనివారం తెలిపారు. 11కేవీ సత్య సాయి ఇండస్ట్రియల్ ఫీడర్ ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.