తూర్పుగోదావరి జిల్లా, గోపాలపురం పరిధిలోని నల్లజర్ల మండలం పోతవరం పాతపేటలో మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కలపాల శ్రీను, భవాని దంపతులకు చెందిన ఇల్లు కుప్పకూలింది. అయితే ప్రమాదాన్ని గంట ముందే గుర్తించిన బాధితులు వేరే చోటికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.