గోపాలపురం మండలం దేవరపల్లిలో మండల ప్రత్యేక అధికారిగా నియమితులైన పశుసంవర్ధక శాఖ డీడీ ఎం. వెంకటేశ్వర్లును జేఏసీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండలం లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డీవీఎంసీ కమిటీ సభ్యులు ఎం. భాస్కర్ కుమార్, జేఏసీ సభ్యులు మడతల శంకరం, పల్లికొండ సురేష్ కుమార్, రాపాక అబ్బుల, అయినపర్తి హరిచంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.