కొవ్వూరు: టైరు పేలి వ్యక్తికీ తీవ్ర గాయాలు

కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ భీమరాజు రాజమండ్రి నుంచి అన్నదేవరపేట వాటర్ బాటిల్స్ వేసుకుని వెళ్లే క్రమంలో టైరు ఒక్కసారిగా పేలి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీమరాజుకి తలపగిలి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు స్పందించి అంబులెన్స్ కి సమాచారమిచ్చారు. పెను ప్రమాదం తప్పిందని అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్