దుద్దుకూరు జాతీయ రహదారిపై లారీ ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం పరిధిలోని దుద్దుకూరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ లలిత రైస్ మిల్కు చెందిన బియ్యం లోడుతో విజయవాడ నుండి పెద్దాపురం వెళ్తున్న లారీని, రాజస్థాన్ వైపు వెళ్తున్న మరో లారీ వెనుక నుండి ఢీకొట్టింది. లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం వెనుక నుండి వచ్చిన వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕